భారీగా పెరిగిన బంగారం ధరలు... 

భారీగా పెరిగిన బంగారం ధరలు... 

కరోనా లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.  ప్రపంచంలో ఆర్ధిక వ్యవస్థలు క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.  అయితే, ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో బంగారానికి మరలా రెక్కలు వచ్చాయి.  బంగారం ధరలు భారీగా పెరిగాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.740 పెరిగి రూ. 47,870కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 810 పెరిగి రూ.52,220కి చేరింది.  ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.62,100కి చేరింది.