బ్యాడ్ న్యూస్: భారీగా పెరిగిన బంగారం ధరలు 

బ్యాడ్ న్యూస్: భారీగా పెరిగిన బంగారం ధరలు 

దేశంలో అత్యధికంగా అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువు బంగారం.  ప్రతి శుభకార్యానికి బంగారం వినియోగిస్తారు.  కరోనా కాలంలో బంగారానికి రెక్కలు వచ్చాయి. రికార్డ్ స్థాయిలో ధరలు పెరిగాయి.  అయితే, అన్ లాక్ సమయంలో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.  అంతర్జాతీయంగా, దేశీయంగా మార్కెట్లు తిరిగి కోలుకోవడంతో బంగారం దిగివచ్చింది.  అయితే, తాజాగా మళ్ళీ బంగారం ధరలు భారీగా పెరిగాయి.  అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం అని నిపుణులు చెప్తున్నారు.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.49,520కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.54,020కి చేరింది.  ఇక వెండి కూడా బంగారం బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ.69,500కి చేరింది.