బంగారం కొనేవారికి షాక్..భారీగా పెరిగిన ధరలు

బంగారం కొనేవారికి షాక్..భారీగా పెరిగిన ధరలు

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 48,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200  పెరిగి రూ. 44,000 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.700 పెరిగి రూ. 73,500 వద్ద కొనసాగుతోంది.