స్థిరంగా బంగారం, వెండి ధరలు

స్థిరంగా బంగారం, వెండి ధరలు

బంగారం బాగా ఖరీదైన వస్తువు.  ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా స్థిరంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 కు చేరింది. బంగారం ధరలు స్థిరంగా నమోదు కాగా.. వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. కిలో వెండి ధర రూ. 72,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.