బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ : భారీగా పడిపోయిన ధరలు

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ : భారీగా పడిపోయిన ధరలు

గతేడాది కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ ఏడాది కూడా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అనుకున్నా, ప్రస్తుతం మాత్రం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజాగా బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 43,800కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి, రూ. 47,780కి చేరింది.  బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది.  కిలో వెండి ధర రూ. 700 పెరిగి రూ. 74,000కి చేరింది.