మహిళలకు షాక్ : మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాక్ : మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధర... ఇవాళ మాత్రం కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 48,330 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44,300కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 73,300 వద్ద కొనసాగుతోంది.