నిలకడగా బంగారం..భారీగా తగ్గిన వెండి ధరలు 

నిలకడగా బంగారం..భారీగా తగ్గిన వెండి ధరలు 

దేశంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండటంతో పాటుగా, దేశీయంగా కూడా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.  అయితే, మంగళవారం రోజున బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి.  తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,590కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కి చేరింది.  బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం ఈరోజు తగ్గాయి.  కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.73,800కి చేరింది.