బంగారం కొనేవారికి మరోసారి షాక్..భారీగా పెరిగిన ధరలు 

బంగారం కొనేవారికి మరోసారి షాక్..భారీగా పెరిగిన ధరలు 

బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 49,200 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250  పెరిగి రూ. 45,100 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 73,900 వద్ద కొనసాగుతోంది.