మహిళలకు షాక్ : 50 వేలకు చేరువలో బంగారం ధరలు

మహిళలకు షాక్ : 50 వేలకు చేరువలో బంగారం ధరలు

ఇండియాలో  బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 పెరిగి రూ. 48,930 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 44,850 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300  పెరిగి రూ. 73,900 వద్ద కొనసాగుతోంది.