మహిళలకు షాక్ : మరోసారి పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాక్ : మరోసారి పెరిగిన బంగారం ధరలు

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 48,270 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90  పెరిగి రూ. 44,250 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 500  పెరిగి రూ. 74,200 వద్ద కొనసాగుతోంది.