మహిళలకు మళ్లీ షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధరలు

మహిళలకు మళ్లీ షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధరలు

బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బంగారం.. ఎంతో విలువైన, చాలా ఖరీదైన వస్తువు. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పైకి ఎగసి రూ. 46,530 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 42, 650 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు అదే మార్గంలో భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ. 70, 500 వద్ద కొనసాగుతోంది.