మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం... ఎంతో విలువైన, చాలా ఖరీదైన వస్తువు. అయితే.. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పైకి ఎగసి రూ. 46,250 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 పెరిగి రూ. 42, 400 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.