స్థిరంగా బంగారం... భారీగా పడిపోయిన వెండి ధరలు

స్థిరంగా బంగారం... భారీగా పడిపోయిన వెండి ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా స్థిరంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 కు చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 300మేర తగ్గి రూ. 69,700 వద్ద కొనసాగుతోంది.