బంగారం కొనేవారికి షాక్‌... భారీగా పెరిగిన ధరలు

బంగారం కొనేవారికి షాక్‌... భారీగా పెరిగిన ధరలు

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న తగ్గిన పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పైకి ఎగసి రూ. 45,440 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 41,650 కు చేరింది. ఇక ఈరోజు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.1400 పెరిగి రూ. 68,700 కు చేరుకుంది.