గుడ్‌న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

గుడ్‌న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర... ఇవాళ మళ్లీ భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 44,840 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250  తగ్గి రూ. 41,100 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా... వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ. 67,300 వద్ద కొనసాగుతోంది.