ఈరోజు బంగారం ధరలు ఇలా..?

ఈరోజు బంగారం ధరలు ఇలా..?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి.  బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి.  అయితే, ఈరోజు బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.  పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 41,710 కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10  పెరిగి రూ.47,500 కి చేరింది.  బంగారం పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.  కిలో వెండి ధర రూ.70,100 వద్ద ఉంది.