షాకింగ్ న్యూస్: భారీగా పెరిగిన పుత్తడి ధరలు
నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం పుత్తడి ధరలు ఈరోజు తిరిగి పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.42,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.46,300కి చేరింది. ఇక బంగారం ధరలతో పాటుగా వెండి కూడా పెరిగింది . కిలో వెండి ధర రూ.800 మేర పెరిగి రూ.72,800కి చేరింది. అయితే, రాబోయే రోజుల్లో ఈ ధరలు మరలా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)