శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు

శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు

పసిడి కొనుగోలు చేయాలనే వారికి శుభవార్త.. బంగారం ధరలు కిందికి దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దాని ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.43,400కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,350కి చేరింది. బంగారం ధరలు కిందికి వస్తే వెండి ధరలు మాత్రం పైకి లేచాయి.కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ. 75,000కి చేరింది.