మగువలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇవాళ కూడా బంగారం ధరలు భారీగానే తగ్గాయి. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.46,900 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 900 తగ్గి రూ.73,400కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)