గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం ధరలు

గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం ధరలు

దేశంలో గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గడం విశేషం.  బంగారం ధరలు తగ్గడంతో మహిళలు బంగారం కొనుగోలుపై దృష్టిసారించారు.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.44,250కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గి రూ.48,290కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం పెరిగాయి.  కిలో వెండి ధర రూ. 400 పెరిగి  73,300 కి చేరింది.  బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.  రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉన్నది.