ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి...

ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి...

దేశంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.  బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలు పెరిగింది. డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు తగ్గుముఖం పడుతుండటం విశేషం.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.44,550 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ.48, 600కి చేరింది.  అయితే, బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా భారీగానే తగ్గింది.  కిలో వెండి ధర రూ. 1,500 తగ్గి రూ. 72,900 కి చేరింది.