ఎన్నికల ఎఫెక్ట్: భారీగా పెరిగిన బంగారం ధరలు... 

ఎన్నికల ఎఫెక్ట్: భారీగా పెరిగిన బంగారం ధరలు... 

నిన్నటితో గ్రేటర్ ఎన్నికలు ముగిసాయి.  ఎన్నికల ముందు వరకు కూడా బంగారం ధరలు అదుపులో ఉండటమే కాకుండా, ధరలు కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.  జీహెచ్ఎంసి ఎన్నికలు ముగిసిన తరువాత రోజే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.  అంతర్జాతీయంగా మార్కెట్లు కోలుకోవడం, దేశీయంగా కూడామార్కెట్లు పుంజుకోవడంతో దాని ప్రభావం బంగారం ధరల పెరుగుదలపై పడిందని చెప్పొచ్చు.  ఇక ఇదిలా ఉంటె హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,900కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.48,980కి చేరింది.  ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.  కిలో వెండి ధర రూ.1300 పెరిగి రూ.64,600కి చేరింది.