గుడ్‌ న్యూస్‌ : మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు..

గుడ్‌ న్యూస్‌ : మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు..

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.  కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.   అయితే... తాజాగా  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు తగ్గగా.. ఈరోజు కూడా ధరలు భారీగా తగ్గాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెప్తున్నారు.  తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.47, 300 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 51, 630కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.68, 300కి చేరింది. బంగారం ధరలు ఇవాళ తగ్గగా... వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.