మళ్ళీ పెరిగిన వెండి ధర... బంగారం ధర ఎంత అంటే... 

మళ్ళీ పెరిగిన వెండి ధర... బంగారం ధర ఎంత అంటే... 

కరోనా తరువాత దేశంలో బంగారం కొనుగోలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడం, ధనత్రయోదశి పండగలు బంగారం కొనుగోళ్లు పెరిగాయి.  నిన్నటి రోజున బంగారం ధర రూ.100 పెరిగింది.  అయితే, ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.  బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ, అటు వెండి ధరలు మాత్రం పెరిగాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉన్నది.  ఇక కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ.63,300కి చేరింది.  పరిశ్రమల యూనిట్లు, నాణెపు తయారీ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది.