మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.  అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే..తాజాగా బంగారం ధరలు కాస్త తక్కువగా పెరిగాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.48,010 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 52,370 కి చేరింది.  బంగారం ధరలు కాస్త పెరిగితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.  మార్కెట్లో కిలో వెండి ధర రూ. 900 పెరిగి.. రూ.65,400కి చేరింది. అయితే..బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.