మళ్లీ షాకిచ్చిన బంగారం...రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

మళ్లీ షాకిచ్చిన బంగారం...రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

కరోనా నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.  అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరిగి రూ.48,000 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ.52,360 కి చేరింది.  బంగారం ధరలు పెరిగితే, వెండి ధర మాత్రం తగ్గాయి.  మార్కెట్లో కిలో వెండి ధర రూ.2100 తగ్గి.. రూ.64,500కి చేరింది. అయితే..బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.