మగువలకు మళ్లీ షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

మగువలకు మళ్లీ షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

కరోనా నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.  అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీ తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్లీ నింగికి తాకింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.47,600కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.51,920 కి చేరింది.  బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది.  మార్కెట్లో కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ.66,300కి చేరింది. అయితే..బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.