మహిళలకు శుభవార్త : భారీగా తగ్గిన పసిడి ధరలు

మహిళలకు శుభవార్త : భారీగా తగ్గిన పసిడి ధరలు

కరోనా, లాక్ డౌన్ కాలంలో బంగారం ధరలు చుక్కలను తాకిన సంగతి తెలిసిందే. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.  అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి రూ.47,250కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.51,550కి చేరింది.  బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది.  మార్కెట్లో కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.67,000కి చేరింది. అయితే..బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.