మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ఈ ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.  నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర నేడు మరలా పెరిగింది.  అంతర్జాతీయంగా ఈ ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.47,200 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 51,490కి చేరింది.  బంగారంతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది.  కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ.62,800కి చేరింది.