బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం పుత్తడి ధరలు ఈరోజు తిరిగి పెరిగాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.42,000 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పెరిగి రూ.45,820 కి చేరింది.  ఇక బంగారం ధరలతో పాటుగా వెండి కూడా పెరిగింది .  కిలో వెండి ధర రూ.900 మేర పెరిగి రూ.71,000 కి చేరింది.  అయితే, రాబోయే రోజుల్లో ఈ ధరలు మరలా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.