గుడ్ న్యూస్ : తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఇక ఈ రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 45,490 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 49,630 కి చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధర భారీగా పడిపోయింది. వెండి ధర 4700 తగ్గడంతో రూ. 65,000 కు పడిపోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)