మగువలకు గుడ్ న్యూస్: దిగొస్తున్న బంగారం ధరలు 

మగువలకు గుడ్ న్యూస్: దిగొస్తున్న బంగారం ధరలు 

గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  లాక్ డౌన్ సమయం భారీగా పెరిగిన ధరలు అన్ లాక్ సమయంలో ధరలు తగ్గుముఖం పట్టాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,700కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.52,040కి చేరింది.  ఇక వెండి ధర కూడా దిగివచ్చింది.  కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ.58,000కి చేరింది.