మహిళలకు గుడ్ న్యూస్: తగ్గిన పుత్తడి ధరలు... 

మహిళలకు గుడ్ న్యూస్: తగ్గిన పుత్తడి ధరలు... 

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి.  కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటుగా, దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.  కరోనా సమయంలో ఆల్ టైమ్ హైకి చేరిన ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.45,950కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,130కి చేరింది.  బంగారం ధరలు భారీగా తగ్గితే, వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది.  కిలో వెండి ధర రూ.50 తగ్గి రూ. 71,350కి చేరింది.