మహిళలకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు   

మహిళలకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు   

గతేడాది కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ ఏడాది కూడా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అనుకున్నా, ప్రస్తుతం మాత్రం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజాగా బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 తగ్గి రూ. 44,450కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి, రూ.48,460కి చేరింది.  బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది.  కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ. 74,000కి చేరింది.