మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!

పసిడి ధరలు మరోసారి మగువలకు గుడ్‌న్యూస్ వినిపించాయి.. ఈ వారంలో ఓరోజు తగ్గితే మరోరోజు పెరుగుతూ వస్తోంది బంగారం ధర.. వరుసగా రెండోరోజులుగా తగ్గుతూ వస్తూ.. మరోసారి బంగారం ప్రేమికులకు ఊరట కల్పిస్తూ భారీగా తగ్గింది.. ఇక, వెండి ధర కూడా బంగారం బాటే పట్టింది.. మరింత భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 తగ్గడంతో రూ.53,550కు పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.430 కిందకు దిగడంతో రూ.49,090కు పడిపోయింది. 

మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. బులియన్ మార్కెట్‌లో ఏకంగా రూ.1700 తగ్గింది.. దీంతో కిలో వెండి ధర రూ.67,800కు దిగొచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పైకే కదిలింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 1957 డాలర్లకు చేరుకోగా.. వెండి మాత్రం కిందకు దిగింది.. ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 26.96 డాలర్లకు క్షీణించింది వెండి ధర.