గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

పసిడి ధరలు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీ మార్కెట్‌లో మాత్రం తగ్గింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో రూ.53,820కి దిగిరాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 తగ్గి.. రూ.49,340కి క్షీణించింది. ఇక, వెండి కూడా పసిడి దారే పట్టింది.. ఏకంగా రూ.900 తగ్గడంతో కిలో వెండి ధర రూ.67,000కి పరిమితమైంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో పసిడి ధర 1916 డాలర్లకు చేరగా.. ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదలతో వెండి ధర 24.59 డాలర్లకు పెరిగింది.