కాస్త పెరిగిన బంగారం.. పడిపోయిన వెండి ధరలు

కాస్త పెరిగిన బంగారం.. పడిపోయిన వెండి ధరలు

దేశంలో మహిళలు బంగారానికి ఎక్కువగా విలువ ఇస్తారు.  ప్రతి చిన్న వేడుకలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు.  ప్రపంచంలో  బంగారాన్ని   వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి.  దీంతో బంగారానికి ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది.  ఇక, హైదరాబాద్ లో ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.46,100కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 50,460 కి చేరింది. బంగారం కాస్త పెరగగా.. వెండి ధర మాత్రం భారీగానే పడిపోయింది. కిలో వెండి ధర రూ. 1100 తగ్గి రూ.71,400కి చేరింది.