మళ్లీ పెరిగిన పసిడి ధర

మళ్లీ పెరిగిన పసిడి ధర

బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. రెండు రోజులు కాస్త కిందికి దిగివచ్చిన పసిడి ధర.. మళ్లీ పెరిగింది... అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పైకి ఎగసి రూ.49,800కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,650కు చేరింది. ఇక, బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు పెట్టింది.. రూ.700 పెరగడంతో కిలో వెండి ధర రూ.70,700కు చేరింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 1845 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్‌కు 0.69 శాతం పెరుగుదలతో 25.49 డాలర్లకు ఎగిసింది.