గుడ్ న్యూస్: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు 

గుడ్ న్యూస్: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు 

దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు తిరిగి తగ్గుముఖం పట్టాయి.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  500 తగ్గి రూ.43,750కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.47,730 కి చేరింది.  ఇక కిలో వెండి ధర రూ.1400 తగ్గి రూ.73,600కి చేరింది.