గత రెండు రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గాయంటే...
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గుతున్నాయి. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గుతుండటం విశేషం. గత రెండు రోజుల్లో బంగారం ధరలు దాదాపుగా రూ.500 వరకు తగ్గింది. అటు వెండి కూడా వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఇక ఈరోజు బంగారం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290గా ఉంది. ఇక కిలోవెండి ధర రూ.600 పెరిగి రూ.73,900గా ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)