గుడ్ న్యూస్: తగ్గుతున్న బంగారం ధరలు... 

గుడ్ న్యూస్: తగ్గుతున్న బంగారం ధరలు... 

దేశంలో అత్యధికంగా వినియోగించే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.  బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దాని ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కూడా పడింది.  ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.45,750కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.49,900కి చేరింది.  ఇక వెండి కూడా అదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.70,700కి చేరింది.