మరింత పైకి కదిలిన పసిడి ధర.. మరో కొత్త రికార్డు..
పసిడి ధరకు రెక్కలు వచ్చాయి.. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ పరుగులు పెడుతోంది.. అమెరికా - చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులకు తోడు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో.. దేశీయ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి.. రూ.55,820కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.220 పెరుగుదలతో రూ.51,250కు చేరుకుంది.. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 10వ రోజు కాగా.. ఇదే ఆల్‌టైం గరిష్టస్థాయి.
మరోవైపు వెండి కూడా తానేం తక్కువ అనే రీతిలో పోటీ పడుతోంది.. ఏకంగా ఒకేరోజు రూ.2000 పెరగడంతో.. కిలో వెండి ధర రూ.65,000కు చేరింది. ఇక, ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి.. రూ.52,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.53,200కు పరుగులు పెట్టింది.. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1.49 శాతం పైకి కదలడంతో.. 1971 డాలర్లకు చేరింది. ఓవైపు భారత్‌లో బంగారానికి డిమాండ్ అమాంతం పడిపోయింది.. ఏకంగా అది 26 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నా.. పడిసి ధరకు మాత్రం బ్రేక్‌లు పడడం లేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)