మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

భారీగా పెరుగుతూ ఆల్‌టైం హై రికార్డుల‌ను సృష్టించి సామాన్యుల‌కు షాక్ ఇచ్చిన బంగారం ధ‌ర‌... నిన్న‌టి నుంచి శుభ‌వార్త చెబుతోంది... సోమ‌వారం కాస్త దిగివ‌చ్చిన బంగారం ధ‌ర‌.. ఇవాళ కూడా మ‌రో మెట్టు దిగింద‌నే చెప్పాలి.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల కూడా దీనికి తోడు కావ‌డంతో.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 క్షీణించ‌డంతో.. రూ.58,470కు దిగిపోయింది. ఇక‌, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.230 త‌గ్గ‌డంతో.. రూ.53,580కు ప‌రిమిత‌మైంది. 

ఇక‌, ప‌సిడి త‌గ్గినా.. వెండి ధ‌ర మాత్రం మ‌రింత పైకి క‌దిలింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.940 పెర‌గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.75,150కి ఎగ‌బాకింది. మ‌రోవైపు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 త‌గ్గి రూ.54,100కి ప‌రిమితం కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 త‌గ్గి రూ.55,350కు పడిపోయింది. మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివ‌చ్చింది.. పసిడి ధర ఔన్స్‌కు 0.63 శాతం క్షీణించ‌డంతో బంగారం ధర ఔన్స్‌కు 2017 డాలర్లకు తగ్గింది.