గోదావ‌రిలో పోటెత్తిన వ‌ర‌ద‌.. భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర పెరిగిన నీటిమ‌ట్టం

గోదావ‌రిలో పోటెత్తిన వ‌ర‌ద‌.. భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర పెరిగిన నీటిమ‌ట్టం

గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకులు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్ర‌స్తుతం భద్రాచలం ద‌గ్గ‌ర‌ గోదావరి నీటిమట్టం 33 అడుగుల దాటి ప్రవహిస్తుంది. ఇక‌, ఎగువన ఉన్న తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవ‌డంతో.. గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి పరిమాణం పెరుగుతుంది. గత రెండు రోజులుగా గోదావరిలో కూడా ప్రవాహ వేగం పెరిగింది. ప్రస్తుతం గోదావరిలో 33 అడుగులులకు చేరుకుంది. మరో రెండు మూడు అడుగులు పెరిగే అవకాశం ఉందని నీటిపారుద‌ల‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే భద్రాచలం సమీపంలో 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.. ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు .అప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటుంది.