కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి...

కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి...

గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 9.73 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్లపై నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో కాళేశ్వరం ప్రాజేక్ట్  నిండుకుండలా మారింది. దాంతో లక్ష్మీ, సరస్వతీ బ్యారేజ్ లకు వరద తాకిడి ఎక్కువైంది. కాబట్టి సరస్వతీ బ్యారెజ్ 45 గేట్లు, లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సరస్వతీ బ్యారెజ్ ఇన్ ఫ్లో 15 లక్షల 4 వేల 769, ఔట్ ఫ్లో 86 వేల 400 క్యూసేక్కులు గా ఉండగా లక్ష్మీ బ్యారెజ్ కు ఇన్ ఫ్లో  5 లక్షల 8 వేల 900, ఔట్ ఫ్లో 5 లక్షల 78 వేల 700 క్యూసెక్కులు గా నమోదయ్యింది.