ఉధృతంగా గోదావ‌రి... 30 గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు..!

ఉధృతంగా గోదావ‌రి...  30 గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు..!

ఎగువ‌న ఎరుస్తున్న భారీ వ‌ర్షాల‌తో క్ర‌మంగా గోదావ‌రిలో ప్ర‌వాహం ఉధృతంగా మారుతోంది.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద  10.6  అడుగులకు చేరింది నీటి మ‌ట్టం.. బ్యారేజీ నుండి  8.56 ల‌క్ష‌ల‌ క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి  విడుదల చేస్తున్నారు అధికారులు... ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా  వేగంగా గోదావరికి వరద ఉధృతి కార‌ణంగా చెబుతున్నారు అధికారులు.. మ‌రోవైపు.. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో గత 4 రోజులుగా ఎడతెరపు లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. కొండరాజుపేట, అన్నవరం, సోకిలేరు, అత్తా కోడళ్ల వాగులపై వ‌ర‌ద‌నీరు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తోంది.. దీంతో.. వి.ఆర్.పురం - చింతూరు మండలాల మధ్య సుమారు 30 గిరిజన గ్రామాలకు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.. ఇక‌, కూనవరం వద్ద క్రమంగా శభరి - గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి...ఓ ప‌క్క క‌రోనా.. మ‌రో ప‌క్క వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.