వైరల్: కోతి రూపంలో మేకపిల్ల జననం... హనుమంతుని అవతారంగా భావించి... 

వైరల్: కోతి రూపంలో మేకపిల్ల జననం... హనుమంతుని అవతారంగా భావించి... 

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ వింత జరిగింది.  ఇటీవలే ఓ మేక కోతి రూపంలో ఉండే మేకపిల్లను జన్మను ఇచ్చింది.  ఆ మేక పిల్లను చూసేందుకు వేలాది మంది వచ్చారు.  కలియుగ హనుమంతుని అవతారంగా భావించి పూజలు చేసి వేలాది రూపాయల కానుకలు సమర్పించారు. దేవుని మహిమ అని, కరోనా అంతం కాబోతుందని ప్రజలు పూజలు చేశారు.  వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరు జిల్లాలోని జహాంగీరాబాద్ గ్రామానికి చెందిన సీతారాం అనే రైతుకు చెందిన ఓ మేక వింత మేకపిల్లను జన్మను ఇచ్చింది.  ముఖం చూసేందుకు కోతిలా, మిగతా భాగం మనిషిని పోలి ఉండటంతో ఆ వార్తా ఆ గ్రామం మొత్తం వ్యాపించింది.  అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలవారు కూడా చూసేందుకు వచ్చారు.  పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. అయితే, మేకపిల్ల పుట్టిన కొన్ని గంటల తరువాత మరణించింది.  మరణించిన మేకపిల్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ఖననం చేశారు.