రోహిత్, స్మిత్ లేకుండానే మాక్స్‌వెల్ ఎలెవన్ జట్టు...

రోహిత్, స్మిత్ లేకుండానే మాక్స్‌వెల్ ఎలెవన్ జట్టు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) యొక్క 13 వ సీజన్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) సిద్ధంగా ఉంది, ఫైనల్ నవంబర్ 10 న జరుగుతుంది. అయితే ఈ టోర్నమెంట్ ఒక నెల దూరంలో ఉన్నందున, ఈ లీగ్‌లో పాల్గొనడానికి ఆటగాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఇటీవల, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన ‘బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్’ ను ఎంచుకున్నాడు. కానీ అందులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను, అలాగే మరో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను మాత్రం ఎన్నుకోలేదు. అందులో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా తీసుకున్న మాక్స్‌వెల్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎబి డివిలియర్స్ ను ఎనుకున్నాడు. సురేష్ రైనాను నాలుగో స్థానం లో తీసుకున్న తరువాత  5 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి తనను తానే స్వయంగా ఎంచుకున్నాడు. ఆ తరువాత ఆండ్రీ రస్సెల్ ను ఆల్ రౌండర్ గా అలాగే కీపర్ గా సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని తీసుకున్నాడు. ఇక హర్భజన్ సింగ్ ‌ను మాత్రమే స్పిన్నర్‌గా ఎంపిక చేశాడు. కానీ పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మోహిత్ శర్మ ముగ్గురిని తీసుకున్నాడు. అయితే తన జట్టుకు కెప్టెన్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.

గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీల్ ఎలెవన్ : డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, సురేష్ రైనా, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రస్సెల్, ఎంఎస్ ధోని (Wk), హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మోహిత్ శర్మ