రగిలిపోయిన ప్రియురాలు... ప్రియుడిపై యాసిడ్ దాడి..

రగిలిపోయిన ప్రియురాలు... ప్రియుడిపై యాసిడ్ దాడి..

ఇప్పటి వరకు ప్రియురాలిపై ప్రియుడి దాడి సందర్భాలే చూశాం.. అక్కడడక్క అమ్మాయిలు కూడా ఇలాంటి ఘటనలు పాల్పడ్డ సందర్భాలు కూడా లేకపోలేదు... తాజాగా, కర్నూలు జిల్లా పెద్దకొట్టాల గ్రామంలో దారుణం జరిగింది. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. బాధితుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో, ప్రియురాలి కోరిక మేరకే నాగేంద్ర మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొత్త జంటను చూసి సహించలేకపోయిన సుప్రియ... ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి మోసం చేసినందుకే... యువకుడిపై యాసిడ్ పోసినట్లు తెల్పింది నిందితురాలు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పి... వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పింది. ప్రేమ కారణంగా చదువు పాడైందని, ఊరిలో పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.