మనుషులే లేని ఎడారిలో పిల్లి బొమ్మ.. ఎవరు గీశారబ్బా ?

మనుషులే లేని ఎడారిలో పిల్లి బొమ్మ.. ఎవరు గీశారబ్బా ?

పెరూ సౌత్ అమెరికాలోని ఓ  దేశం. ఇక్కడ విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక ఆ దేశ ఎడారులను చూసి అందరూ ఫిదా అయిపోతుంటారు. అందుకే అందరూ ఆ దేశ ఎడారి అందాలు ఆస్వాదించడానికి వెళుతుంటారు. అయితే ఓ ఎడారి మాత్రం మిస్టరీలా ఉంటుంది. అదే పెరువియన్ ఎడారి. ఈ ఎడారినే నాజ్కా అని కూడా పిలుస్తారు. ఆ ఎడారిలో గీతలు రకరకాల ఆకారాల్లో దర్శనమిస్తుంటాయి.

అవేంటనేది ఎవరికీ అంతుబట్టలేదు. ఇక ఈ ఎడారి ప్రాంతంలో మానవులకు అలాగే జంతువులకు సంబంధించిన దాదాపు 900 రేఖాగణిత ఆకారాలను చెక్కారు. ఇలా చెక్కిన ఈ ఆకారాలనే నాజ్కా లైన్స్ అని పిలుస్తారని అయితే ఈ కళా ఖండాలు నాజ్కా నాగరికతనే కాకుండా పురాతన నాగరికతను తెలుపుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అలా ఇప్పుడు తాజాగా ఒక పిల్లి బొమ్మ బయట పడింది.